మిథాలీ గ్యాంగ్ క్యాష్ ప్రైజ్ పెంపు!

27 Jul, 2017 11:19 IST|Sakshi



న్యూఢిల్లీ:మహిళల వన్డే ప్రపంచకప్లో ఫైనల్ కు చేరి రన్నరప్ గా నిలిచిన మిథాలీ రాజ్ గ్యాంగ్ ను మరింత ప్రోత్సహించే దిశగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అడుగులు వేస్తుంది. వరల్డ్ కప్లో పాల్గొన్న 15 మందితో కూడిన భారత మహిళా బృందానికి ప్పటికే తలో రూ.50లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన బీసీసీఐ..మరింత నగదు నజరానాను ఇవ్వాలని యోచిస్తోంది. కొన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాల అభ్యర్ధనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ ఆ మేరకు అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా క్రీడాకారిణుల నగదు నజరాను రూ. 60లక్షలకు పెంచాలనే చూస్తోంది.

అదే సమయంలో సహాయక సిబ్బందికి రూ.30 లక్షలను ఇవ్వడానికి బోర్డు పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన భారత్ గౌరవాన్ని ఇనుమడింపజేసిన మహిళా జట్టుకు, సహాయక సిబ్బందికి నజరానాను పెంచినా ఎటువంటి ఇబ్బందులు ఉండవని వెస్ట్జోన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీనికి ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే మహిళలు ఆడే మ్యాచ్ ఫీజును కూడా పెంచే యెచనలో్ బీసీసీఐ ఉంది.

>
మరిన్ని వార్తలు