సచిన్-రిచర్డ్స్ ట్రోఫీ!

9 Sep, 2014 00:37 IST|Sakshi
సచిన్-రిచర్డ్స్ ట్రోఫీ!

‘మాస్టర్’ పేరుతో సిరీస్ ఆలోచనలో బీసీసీఐ
 
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరును ఏదో ఒక దేశంతో క్రికెట్ సిరీస్‌కు పెట్టి గౌరవించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల సిరీస్‌కు బోర్డర్-గవాస్కర్ పేరుతో; ఇంగ్లండ్, భారత్ సిరీస్‌కు పటౌడీ పేరుతో ట్రోఫీలు అందిస్తున్నారు. ఇప్పుడు సచిన్ పేరును కూడా ఏదో ఒక సిరీస్‌కు పెట్టాలని బోర్డు పెద్దలు ఆలోచనలో ఉన్నారు. ఈ నెలలో జరిగే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చిస్తారు.
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే... పాకిస్థాన్‌తో ఎప్పుడు సిరీస్ జరుగుతుందో, ఎప్పుడు జరగదో తెలియదు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో సచిన్‌తో సమాన స్థాయి ఉన్న దిగ్గజాలు లేరు. కాబట్టి వెస్టిండీస్, భారత్ సిరీస్‌కు సచిన్-రిచర్డ్స్ ట్రోఫీ ఏర్పాటు చేస్తే మేలనే ప్రతిపాదన ఉంది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో స్వదేశంలో భారత్ ఆడే సిరీస్‌కే ఈ పేరు పెట్టే అవకాశం ఉంది. మాస్టర్ తన చివరి మ్యాచ్‌ను కూడా వెస్టిండీస్‌పైనే ఆడాడు.

మరిన్ని వార్తలు