త్వరలో పాక్‌తో సిరీస్!

25 Jan, 2014 00:58 IST|Sakshi

న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో త్వరలోనే తటస్థ వేదికపై క్రికెట్ సిరీస్ ఆడించేందుకు బీసీసీఐ ఆలోచిస్తోంది. దుబాయ్, షార్జా లేక అబుదాబిలో ఈ సిరీస్ జరిగే అవకాశాలున్నాయి. ఈమేరకు గురువారం చెన్నైలో జరిగిన బోర్డు అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. ‘తటస్థ వేదికలో పాక్‌తో సిరీస్ జరిపే అంశంపై సమావేశంలో కొద్దిసేపు చర్చ జరిగింది. అయితే ఇప్పటిదాకా తుది నిర్ణయం తీసుకోలేదు.  కచ్చితంగా  ఈ సిరీస్ జరిపేందుకు ప్రయత్నిస్తాం. అలాగే పాక్ క్రికెట్ బోర్డుతో కూడా మాట్లాడతాం’ అని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చివరిసారిగా భారత్ జట్టు పాక్‌తో 2007-08లో టెస్టు సిరీస్, 2012-13లో వన్డే సిరీస్ ఆడింది.


 మార్చిలో హాకీ సిరీస్!
 కరాచీ: మార్చిలో ద్వైపాక్షిక హాకీ సిరీస్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్ వెళ్లే అవకాశాలున్నాయి. హాకీ ఇండియా కార్యదర్శి నరీందర్ బాత్రాతో తను టెలిఫోన్‌లో సంభాషించినట్లు, ఈ మేరకు ఆయన కూడా ఆసక్తి ప్రదర్శించారని పాకిస్థాన్ హాకీ సమాఖ్య కార్యదర్శి రాణా ముజాహిద్ తెలిపారు. త్వరలోనే ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరిగే వీలుందని చెప్పారు.
 

మరిన్ని వార్తలు