అజారుద్దీన్ ను ఎందుకు పిలిచారు?

13 Oct, 2015 19:13 IST|Sakshi
అజారుద్దీన్ ను ఎందుకు పిలిచారు?

న్యూఢిల్లీ:మహ్మద్ అజారుద్దీన్.. ఒకనాటి భారత క్రికెట్ జట్టు కెప్టెన్.  2000లో జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా అజారుద్దీన్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై బీసీసీఐ జీవితకాలం నిషేధం విధించింది. ఇంకా అజార్ పై బీసీసీఐ విధించిన నిషేధం కొనసాగుతూనే ఉంది.  కాగా, ఇటీవల నగరంలోని ఫిరోజషా కోట్ల మైదానంలో విదర్భ- ఢిల్లీ జట్ల మధ్య జరిగిన రంజీ మ్యాచ్ కు టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ హాజరుకావడంతో పాటు పలువురు ఆటగాళ్లతో మాట్లాడటంపై బీసీసీఐ ఆరా తీసింది.

 

ఢిల్లీ, ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోయేషన్(డీడీసీఏ) ఉపాధ్యక్షుడు చేతన్ చౌహాన్ ఆహ్వానం మేరకు అజహార్ అక్కడకు హజరయ్యాడు. ఈక్రమంలోనే ఆటగాళ్ల అధికారిక సమావేశంలో అజహర్ పాల్గొన్నాడు. దీనిపై బీసీసీఐ ఓ లేఖాస్తాన్ని డీడీసీఏకు సంధించింది. అజహర్ ను అధికారిక సమావేశానికి ఎందుకు పిలిచారో చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.   ఇకనైనా నిషేధం ఉన్న ఆటగాడితో  ఇతర ఆటగాళ్లు మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీసీసీఐ లేఖలో పేర్కొన్నట్లు చేతన్ చౌహాన్ తెలిపాడు.

మరిన్ని వార్తలు