ఆ జెర్సీకి కూడా రిటైర్మెంట్‌ ఇవ్వాలి: గంభీర్‌

10 Jun, 2019 16:05 IST|Sakshi

ఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు సాధించిన రెండు వరల్డ్‌కప్‌లో(2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌) కీలక పాత్ర పోషించిన యువరాజ్‌ సింగ్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పడంపై మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ స్పందించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు యువీ వీడ్కోలు చెప‍్పడంపై గంభీర్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశాడు. ‘నీ అద్భుతమైన కెరీర్‌కు శుభాభినందనలు ప్రిన్స్. భారత్‌కు వన్డే క్రికెట్‌లో నువ్వు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌వి. యువీ సేవలకుగానూ జెర్సీ నెంబర్ 12కి కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించాలి. నాకు నీ తరహాలో బ్యాటింగ్ చేయాలని ఉండేది చాంపియన్‌ ’ అంటూ ట్వీట్ చేశారు.

యువరాజ్‌ సింగ్‌ సోమవారం తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ముంబైలోని ఓ హోటల్‌లో మీడియాతో సమావేశమైన యువీ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు. తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, జీవితంలో ఏ విధంగా పోరాడాలో క్రికెటే నేర్పిందని యువరాజ్‌ భావోద్వేగంగా మాట్లాడాడు.
(ఇక్కడ చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువరాజ్‌ సింగ్‌)

>
మరిన్ని వార్తలు