అజహర్‌తో ఎందుకు మాట్లాడారు?

14 Oct, 2015 01:18 IST|Sakshi
అజహర్‌తో ఎందుకు మాట్లాడారు?

 డీడీసీఏకు బీసీసీఐ లేఖ
  న్యూఢిల్లీ: బీసీసీఐ నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌తో విదర్భ రంజీ ఆటగాళ్లు సంభాషించడం వివాదాస్పదమైంది. 2000లో వెలుగు చూసిన మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగా అజ్జూపై బీసీసీఐ వేటు వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఉపాధ్యక్షుడు చేతన్ చౌహాన్ ఆహ్వానం మేరకు అజహర్ మైదానానికి వచ్చారు. అయితే విదర్భకు ఆడుతున్న వెటరన్ క్రికెటర్లు వసీం జాఫర్, ఎస్.బద్రీనాథ్, చీఫ్ కోచ్ పారస్ మాంబ్రే..

అజహర్‌తో మాట్లాడుతూ కనిపించారు. అవినీతి వ్యతిరేక యూనిట్ నిబంధనల ప్రకారం నిషేధిత ఆటగాళ్లతో ప్రస్తుత క్రికెటర్లు ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు. ‘బీసీసీఐ నుంచి మాకు లేఖ అందిన విషయం వాస్తవమే. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల అధికారిక స్థలం (పీఎంఓఏ)లో అజహర్‌తో వారు ఎలా మా ట్లాడారని ప్రశ్నించారు. అయితే అజహర్ పీఎంఓఏ దగ్గర లేరు. ఈవిషయంలో కాస్త గందరగోళం నెల కొంది. ఏది ఏమైనా అజ్జూతో ఆటగాళ్లు మాట్లాడకూడదని చెప్పారు కాబట్టి ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాం’ అని చౌహాన్ తెలిపారు.

మరిన్ని వార్తలు