బెల్జియం సైక్లిస్టు మృతి

6 Aug, 2019 13:07 IST|Sakshi

వార్సా: బెల్జియంకు చెందిన బిజార్జ్‌ లాంబ్రెచెట్‌ మృతి చెందాడు. పొలాండ్‌ టూర్‌లో భాగంగా రేసును పూర్తి చేసే క్రమంలో సైకిల్‌ పైనుంచి కిందపడిన 22 ఏళ్ల బిజార్డ్‌ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. 30 కి​.మీ రేసును ఆరంభించిన తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో సైకిల్‌ అదుపు తప్పింది. దాంతో రాళ్లపై పడిన బిజార్జ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటీనా హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కాగా, సోమవారం బిజార్జ్‌ మృతి చెందినట్లు ధృవీకరించారు. 

‘ ఇది మా సైక్లింగ్‌ చరిత్రలో అది పెద్ద విషాదం. బిజార్జ్‌ లేడన్న విషయం జీర్ణించుకోలేనిది. అతని ఆత్మకు శాంతి చేకూరాలి. అతని మరణం ఆ కుటంబానికి తీరని లోటు’ అని బెల్జియం సైక్లిస్టు టీమ్‌ విభాగం లొట్టో సౌడల్‌ పేర్కొంది. అయితే ఇది హైస్పీడ్‌ రేసు కాకపోయినా బీజార్జ్‌ కిందపడిపోవడంతో తీవ్ర గాయాలు పాలయ్యాడని రేస్‌ డైరెక్టర్‌ చెస్లా లాంగ్‌ పేర్కొన్నారు. అతనికి తగిలిన గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యులు చేసిన చికిత్ప ఫలించలేదన్నాడు. చికిత్స చేసే సమయంలో గుండె పని తీరు సరిగా ఉన్నప్పటికీ ఆపరేషన్‌ చేసిన తర్వాత అది విఫలమైందన్నారు.

మరిన్ని వార్తలు