క్వార్టర్స్‌లో బెల్జియం

28 Jun, 2016 00:56 IST|Sakshi
క్వార్టర్స్‌లో బెల్జియం

టౌలోస్ (ఫ్రాన్స్): అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోతున్న బెల్జియం స్టార్ ఫార్వర్డ్ ఆటగాడు ఈడెన్ హజార్డ్ ఎట్టకేలకు జూలు విదిల్చాడు. టోర్నీలో తొలి గోల్ సాధించడంతో పాటు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆదివారం హంగెరీతో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో బెల్జియం 4-0తో ఘనవిజయం సాధించి క్వార్టర్స్‌లో ప్రవేశించింది.

ఓ మేజర్ టోర్నీలో ఈ జట్టుకు ఇదే భారీ విజయం. అలాగే 1980 యూరో అనంతరం క్వార్టర్స్ చేరడం ఇదే తొలిసారి. బెల్జియం తరఫున అల్డర్‌వీరెల్డ్ (10), బట్షువాయి (78), హజార్డ్ (80), కరాస్కో (90) గోల్స్ సాధించారు. క్వార్టర్స్‌లో ఈ జట్టు వేల్స్‌తో ఆడుతుంది.

మరిన్ని వార్తలు