విరాట్.. మనసున్నమారాజు

6 May, 2016 18:24 IST|Sakshi
విరాట్.. మనసున్నమారాజు

మైదానంలో భారత యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగే కాదు ప్రవర్తన కూడా దూకుడుగా ఉంటుంది. బ్యాట్తో బౌలర్లకు చుక్కలు చూపించే విరాట్.. ప్రత్యర్థులు నోరు జారితే అంతే దీటుగా స్పందిస్తాడు. మాటల యుద్దానికైనా, గొడవకైనా సై అంటాడు. దీంతో అతను కొన్నిసార్లు విమర్శలపాలయ్యాడు కూడా. అయితే కోహ్లీలో చాలామందికి తెలియని మరో పార్శ్యం కూడా ఉంది. విరాట్ మనసు వెన్న. వ్యక్తిగత జీవితంలో నిబ్బరంగా, సేవాభావంతో ప్రవర్తిస్తాడు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ ఇటీవల పుణెలో ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించాడు. అక్కడ పెద్దలతో ఎంతో అప్యాయంగా మాట్లాడి వారి క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నాడు. పుణెలో ఆడిన ఐపీఎల్ మ్యాచ్లో తనకు వచ్చే ఫీజులో 50 శాతాన్ని ఆ సంస్థకు విరాళంగా ప్రకటించాడు. అంతేగాక విరాట్ కోహ్లీ ఫౌండేషన్ తరపున ఆ సంస్థకు మరింత సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. కుటుంబ పెద్దలను జాగ్రత్తగా చూసుకోవడం మనందరి బాధ్యతని ఈ సందర్భంగా కోహ్లీ ఉద్వేగంగా చెప్పాడు. పెద్దవాళ్ల బాగోగులు చూడకుండా వదిలివేయడం తప్పని అన్నాడు. లవర్ బాయ్గా, యాంగ్రీ యంగ్మన్గా, దూకుడైన క్రికెటర్గా కనిపించే కోహ్లీ.. ఓ ఆదర్శమైన యువకుడు కూడా..

మరిన్ని వార్తలు