పట్టు బిగిస్తున్న ఇంగ్లండ్

13 Jul, 2013 05:51 IST|Sakshi
పట్టు బిగిస్తున్న ఇంగ్లండ్

 నాటింగ్‌హామ్: రెండు రోజులపాటు బౌలర్లు రాజ్యమేలిన యాషెస్ తొలి టెస్టులో ఎట్టకేలకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కదం తొక్కారు. దీంతో ఆతిథ్య జట్టు పట్టు బిగించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఇయాన్ బెల్ (228 బంతుల్లో 95 బ్యాటింగ్; 12 ఫోర్లు) నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకోవడంతో శుక్రవారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 133 ఓవర్లలో 6 వికెట్లకు 326 పరుగులు చేసింది.
 
  క్రీజులో బెల్‌తో పాటు స్టువర్ట్ బ్రాడ్ (122 బంతుల్లో 47 బ్యాటింగ్; 5 ఫోర్లు) ఉన్నాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 261 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ కుక్ (165 బంతుల్లో 50; 6 ఫోర్లు), కెవిన్ పీటర్సన్ (150 బంతుల్లో 64; 12 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. మిచెల్ స్టార్క్, ఆస్టన్ ఎగర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
 
 మరో వివాదం: రెండో రోజు ట్రాట్ క్యాచ్ అవుట్ వివాదం కాగా మూడో రోజు బ్రాడ్ క్యాచ్ అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించడం చర్చనీయాంశమైంది. ఎగర్ బౌలింగ్‌లో బ్రాడ్ ఆడిన బంతి స్లిప్‌లో ఉన్న క్లార్క్ చేతిలోకి వెళ్లింది. కానీ అంపైర్ అవుటివ్వక పోవడంతో బ్రాడ్ క్రీజులో నుంచి కదల్లేదు. ఆసీస్ రివ్యూలు కూడా అయిపోవడంతో ఏమీ చేయలేకపోయారు.
 
  కికెట్
 ఆస్ట్రేలియా x ఇంగ్లండ్
 యాషెస్ తొలి టెస్టు
 నాటింగ్‌హామ్
 మ. గం. 3.30 నుంచి
 స్టార్ క్రికెట్‌లో
 ప్రత్యక్ష ప్రసారం
 
 

మరిన్ని వార్తలు