శతక్కొట్టారు

11 Nov, 2016 08:47 IST|Sakshi
శతక్కొట్టారు

తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు
స్టోక్స్, మొయిన్ సెంచరీలు
ధీటుగా స్పందించిన భారత ఓపెనర్లు 

ఒకరిని మించి మరొకరు... రూట్ చూపించిన దారిలో మొరుున్ అలీ, స్టోక్స్ కూడా చెలరేగిపోయారు. అద్భుతమైన నిలకడతో సెంచరీలు చేశారు. భారత గడ్డపై బ్యాటింగ్ చేయడం ఇంత సులభమా అని మిగిలిన జట్లు అసూయ పడేలా ఇంగ్లండ్ పరుగుల వర్షం కురిపించింది. ఫలితంగా భారత్‌తో తొలి టెస్టులో భారీస్కోరుతో ఇంగ్లండ్ బలమైన స్థితికి చేరింది.

తొలి రోజు మూడు క్యాచ్‌లు వదిలేసినా రెండో రోజూ భారత జట్టు తప్పులు దిద్దుకోలేదు. మరో రెండు క్యాచ్‌లు వదిలేయడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ నత్తల్లా కదిలారు. ఒక్క పరుగు వచ్చే చోట మనోళ్లు రెండేసి ఇచ్చేశారు. ఫలితంగా కోహ్లి కెప్టెన్ అయ్యాక స్వదేశంలో భారత్ తొలిసారి ఆత్మరక్షణలో పడింది. మన ఓపెనర్లు ఆచితూచి ఆడి వికెట్ పడకుండా ఓ సెషన్‌తో ధీటుగా స్పందించినా... పిచ్‌పై అప్పుడే టర్న్ మొదలైంది. ఇక మూడో రోజు భారత బ్యాట్స్‌మెన్ ఏం చేస్తారనే అంశంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.

రాజ్‌కోట్: భారత గడ్డపై తమ రికార్డులు తామే అందుకుంటూ ఇంగ్లండ్ జట్టు దూసుకుపోతోంది. నాలుగేళ్ల క్రితం కోల్‌కతా టెస్టులో 500 పైచిలుకు పరుగులు చేసిన ఇంగ్లండ్... మరోసారి సులభంగా ఐదొందలు చేసింది. ఈ మధ్య కాలంలో మరే జట్లూ భారత్‌పై భారత్‌లో ఐదొందలు చేయలేదు. స్టోక్స్ (235 బంతుల్లో 128; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ తో సెంచరీ చేయగా... ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ మొయిన్ అలీ (213 బంతుల్లో 117; 13 ఫోర్లు) కూడా సెంచరీ చేశాడు. తొలి రోజు రూట్ కూడా సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురి శతకాలతో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీస్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో కుక్‌సేన 159.3 ఓవర్లలో 537 పరుగులు చేసి ఆలౌటరుుంది. బెరుుర్‌స్టో (57 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడగా... టెరుులెండర్ అన్సారీ (83 బంతుల్లో 32; 3 ఫోర్లు) కూడా ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా... షమీ, ఉమేశ్, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్  ప్రారంభించిన భారత్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. గంభీర్ (68 బంతుల్లో 28 బ్యాటింగ్; 4 ఫోర్లు), విజయ్ (70 బంతుల్లో 25 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులు వెనకబడి ఉంది.

సెషన్ 1: వేగంగా పరుగులు
కొత్త బంతి తీసుకుని భారత్ రోజును ప్రారంభించగా... ఆడిన మూడో బంతిని సింగిల్ తీసి మొరుున్ అలీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత అలీ ఒక్కసారిగా వేగం పెంచి ఉమేశ్ వేసిన ఒకే ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. రెండో ఎండ్‌లో స్టోక్స్ జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతుల్ని వదలకుండా బౌండరీకి పంపాడు. షమీ ఓ చక్కటి బంతితో మొరుున్‌ను అట్ చేశాడు. స్టోక్స్, మొరుున్ ఐదో వికెట్‌కు 62 పరుగులు జత చేశారు. బెరుుర్‌స్టో ఆరంభంలో నెమ్మదిగా ఆడి కుదురుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మిశ్రా బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో ఇన్నింగ్‌‌స వేగం పెంచాడు. మరో ఎండ్‌లో స్టోక్స్ 89 బంతుల్లో అర్ధసెంచరీ మార్కును చేరుకున్నాడు.

అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఉమేశ్ బౌలింగ్‌లో స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ సాహా వదిలేశాడు. ఉమేశ్ తర్వాతి ఓవర్లోనూ స్టోక్స్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను సాహా మరోసారి జారవిడిచాడు. బెరుుర్‌స్టో మరో సిక్సర్‌తో పాటు చకచకా బౌండరీలతో దూసుకుపోతున్న సమయంలో షమీ ఈ జోరుకు బ్రేక్ వేశాడు. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి బెరుుర్‌స్టో వెనుదిరిగాడు. స్టోక్స్, బెరుుర్‌స్టో ఆరో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ఈ సెషన్‌లో నాలుగుకు పైగా రన్‌రేట్‌తో ఇంగ్లండ్ వేగంగా పరుగులు చేసింది.

ఓవర్లు: 30 పరుగులు: 139 వికెట్లు: 2
సెషన్ 2: ఎట్టకేలకు ఆలౌట్

లంచ్ తర్వాత తొలి ఓవర్లోనే జడేజా బౌలింగ్‌లో వోక్స్ అవుటయ్యాడు. అదే జోరులో జడేజా... రషీద్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. అరుుతే ఈ దశలో స్టోక్స్‌కు స్పిన్నర్ అన్సారీ అండగా నిలిచాడు. జడేజా బౌలింగ్‌లో బౌండరీతో స్టోక్స్ 173 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్‌లో ఇది తనకు నాలుగో సెంచరీ. అన్సారీ నెమ్మదిగా ఆడినా స్టోక్స్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యంలో భాగమయ్యాడు. ఉమేశ్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇవ్వడం ద్వారా స్టోక్స్ వెనుదిరిగాడు. దీంతో విరామం ఇవ్వకుండా కొంతసేపు సెషన్‌ను పొడిగించారు. ఆ తర్వాత కొద్దిసేపు భారత బౌలర్ల ఓపికను పరీక్షించిన అన్సారీ... చివరకు మిశ్రా బౌలింగ్‌లో ఎల్బీగా అవుటయ్యాడు. ఈ సెషన్‌లో పరుగులు చాలా నెమ్మదించారుు.
ఓవర్లు: 36.3 పరుగులు: 87 వికెట్లు: 4

సెషన్ 3: ఓపెనర్ల జాగ్రత్త
ప్రత్యర్థి భారీ స్కోరు చేయడంతో భారత ఓపెనర్లు గంభీర్, విజయ్ కూడా జాగ్రత్తగా ఇన్నింగ్‌‌సను మొదలుపెట్టారు. ఇద్దరూ ఆరంభంలో చెరో బౌండరీ కొట్టినా... ఆ తర్వాత జోరు తగ్గింది. ముఖ్యంగా స్పిన్నర్లు బౌలింగ్‌కు వచ్చాక బౌండరీలు రావడం కష్టమరుుంది. చివర్లో కాస్త టర్న్ కనిపించినా... బ్యాటింగ్ చేయడం కష్టంగా మాత్రం లేదు. అరుుతే వికెట్ పడకుండా రోజును ముగించాలనే లక్ష్యంతో భారత ఓపెనర్లు ఆడినట్లు కనిపించారు.
ఓవర్లు: 23 పరుగులు: 63 వికెట్లు: 0

‘కొన్నిసార్లు క్యాచ్‌లు జారిపోతుంటారుు. అది ఆటలో భాగంగా చూడాలి. ఇది అందరి వైఫల్యం. దీనికి అశ్విన్ ఒక్కడినే బాధ్యుడిని చేయకూడదు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం దురదృష్టం. మూడో రోజు నుంచి స్పిన్నర్లకు పిచ్  సహకారం లభిస్తుందని అనుకుంటున్నా. మేం ఆశావహ దృక్పథంతో ఆడతాం’ - రవీంద్ర జడేజా

భారత గడ్డపై 1990 తర్వాత ఒక విదేశీ జట్టులోని ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి. 2002లో వెస్టిండీస్, 2003లో న్యూజిలాండ్, 2009లో శ్రీలంక మాత్రమే ఈ ఘనత సాధించారుు.

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ముగ్గురు ఒకే ఇన్నింగ్‌‌సలో సెంచరీ చేసి ఐదేళ్లరుుంది. చివరిసారిగా స్వదేశంలో శ్రీలంకపై 2011లో ఈ ఘనత సాధించారు.

31  భారత్‌లో ఇంగ్లండ్‌కు గత 31 సంవత్సరాలలో ఇదే అత్యధిక స్కోరు. 1985లో ఆ జట్టు చెన్నైలో జరిగిన టెస్టులో ఏడు వికెట్లకు 652 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు