స్టోక్స్‌ ధాటికి విండీస్‌ విలవిల

8 Sep, 2017 10:45 IST|Sakshi
స్టోక్స్‌ ధాటికి విండీస్‌ విలవిల

లండన్‌: మీడియం పేసర్‌ బెన్‌ స్టోక్స్‌ (6/22) హడలెత్తించడంతో... ఇంగ్లండ్‌తో లార్డ్స్‌ మైదానంలో గురువారం మొదలైన మూడో టెస్టులో విండీస్‌ తొలి రోజే తడబడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌ స్టోక్స్‌ ధాటికి 57.3 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. అండర్సన్, రొలాండ్‌ జోన్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. విండీస్‌ జట్టులో కీరన్‌ పావెల్‌ (39; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో 4 వికెట్లకు 46 పరుగులు చేసింది.   

 

మరిన్ని వార్తలు