భువీ పైకి.. కోహ్లీ కిందకు.. రోహిత్‌ ఎక్కడో!

10 Jan, 2018 10:25 IST|Sakshi

భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తన కెరీర్‌లో ఉత్తమ ర్యాంకు చేరుకున్నాడు. తన టెస్టు కెరీర్‌ ర్యాంకింగ్‌లో 8 స్థానాలు ఎగబాకి 22స్థానానికి చేరుకున్నాడు. తొలిటెస్టులో భువనేశ్వర్‌ కుమార్‌ ఆరు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అయితే తొలి టెస్టులో దారుణంగా విఫలమైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బ్యాట్‌మెన్‌ పుజారాల ర్యాంకులు పడిపోయాయి.

టెస్టు బ్యాట్‌మెన్‌ ర్యాంకింగ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌, స్మిత్‌ 947 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తొలి టెస్టులో విఫలమైనందున 13 పాయింట్లు కోల్పోయిన కోహ్లీ రెండో స్థానం నుంచి మూడోస్థానానికి వచ్చేశాడు. ఇంగ్లండ్‌కు చెందిన జోయ్‌ రూట్‌, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 26 రావడంతో  కోహ్లీ స్థానానికి ఎగబాకాడు. మురళీ విజయ్‌ ఐదు స్థానాలు కోల్సోయి 30స్థానానికి దిగజారగా..  శిఖర్‌ ధావన్‌ 33, రోహిత్‌ శర్మ 44 స్థానంలో ఉన్నారు.

జట్లు ర్యాంకింగ్‌ విషయానికి వస్తే 124 భారత్‌ తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. తరువాత దక్షిణాఫ్రికా 111 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 104 పాయింట్లతో మూడోస్థానంలో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు