భువీ 3,2,1,1,5..

9 Jun, 2019 20:29 IST|Sakshi

లండన్‌ : ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 352 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌కు ఆరంభంలోనే భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తన తొలి స్పెల్‌లో ఆసీస్‌ ఓపెనర్లకు వణుకుపుట్టించాడు. బంతిని రెండు వైపుల స్వింగ్‌ చేస్తూ, పరుగులు ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. ఇక వార్నర్‌ పదేపదే ఫుట్‌వర్క్‌ మార్చి బ్యాటింగ్‌ చేసిన పరుగుల కోసం తంటాలు పడుతున్నాడు. అయితే తొలి స్పెల్‌లో ఐదు ఓవర్లలో భువీ వరుసగా 3,2,1,1,5 పరుగులు మాత్రమే ఇచ్చి ఆకట్టుకున్నాడు. (చదవండి: సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసిన రోహిత్‌

అయితే దీనిపై సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. చదువుల్లో ర్యాంకుల్లా భువీ బౌలింగ్‌లో పరుగులు వస్తున్నాయంటూ చమత్కరిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. టీమిండియా ఆటగాళ్లలో శిఖర్‌ ధావన్‌(117; 109 బంతుల్లో 16 ఫోర్లు), రోహిత్‌ శర్మ(57; 70 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(82; 77 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా(48; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు మెరుపులు మెరిపించడంతో భారత్‌ భారీ స్కోరు సాధించింది.

మరిన్ని వార్తలు