భారత బాక్సింగ్ సంఘంపై వేటు

15 Sep, 2015 17:15 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సంఘంపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు అంతర్జాతీయ అమోచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) మరోసారి స్పష్టం చేసింది. అక్టోబర్ 3న గువాహటిలో జరిగే వార్షిక సమావేశానికి ఇప్పటికే సస్పెండయిన బాక్సింగ్ ఇండియా షెడ్యూల్ ను ఖరారు చేయడం చెల్లుబాటు కాదని, ఆ సమావేశానికి విలువ ఉండబోదని తెలిపింది. ఈమేరకు మంగళవారం భారత బాక్సింగ్ సంఘానికి ఏఐబీఏ చైర్మన్ కిషన్ నార్సీ  ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు.

 

రెండు వారాల పాటు జాతీయ స్థాయిలో జరిగే వార్షిక సమావేశాల షెడ్యూల్ ను ఏఐబీఏ పరిధిలో పనిచేసే అడ్ హక్ కమిటీ మాత్రమే ఖరారు చేస్తుందని నార్సీ పేర్కొన్నారు . భారత బాక్సింగ్ అసోసియేషన్ కు సంబంధించి సలహాలు, సూచనలకు ఏఐబీఏ ఆమోదం తప్పనిసరిగా పొందాలని నార్సీ తెలిపారు.  దీన్ని ఉల్లంఘించినందున భారత బాక్సింగ్ సంఘంపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలిపారు. ఈ తాజా సస్పెన్షన్ వేటు త్వరలో దోహాలో జరిగే వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

>
మరిన్ని వార్తలు