ఒడిశా వారియర్స్‌కు నిఖత్‌ జరీన్‌

20 Nov, 2019 05:04 IST|Sakshi

పంజాబ్‌ రాయల్స్‌ తరఫున ప్రసాద్‌

న్యూఢిల్లీ: భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించనున్న ‘బిగ్‌ బౌట్‌ ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌’ బరిలో దిగే బాక్సర్ల వివరాలను ప్రకటించారు. ఈ లీగ్‌ డిసెంబర్‌ 2 నుంచి 21 వరకు జరుగుతుంది. మొత్తం ఆరు జట్లు టైటిల్‌ కోసం తలపడతాయి. తెలంగాణ బాక్సర్, ప్రపంచ జూనియర్‌ మాజీ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ ఒడిశా వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా... భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ పంజాబ్‌ రాయల్స్‌ తరఫున పోటీపడనుంది. వీరిద్దరు 51 కేజీల విభాగంలో బరిలోకి దిగుతారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిపల్లి లలితా ప్రసాద్‌ పురుషుల 52 కేజీల విభాగంలో పంజాబ్‌ రాయల్స్‌ జట్టుకు ఆడతాడు. ఇదే విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత అమిత్‌ పంఘాల్‌ టీమ్‌ గుజరాత్‌ అదానీకి ప్రాతినిధ్యం వహిస్తాడు.

జట్ల వివరాలు 
ఒడిశా వారియర్స్, బెంగళూరు బ్రాలర్స్, పంజాబ్‌ రాయల్స్, టీమ్‌ గుజరాత్‌ అదానీ, బాంబే బుల్లెట్స్, నార్త్‌ ఈస్ట్‌ రైనోస్‌.  
వెయిట్‌ కేటగిరీలు 
మహిళల విభాగం: 51 కేజీలు, 60 కేజీలు; పురుషుల విభాగం: 52 కేజీలు, 57 కేజీలు, 69 కేజీలు, 75 కేజీలు, 91 కేజీలు.

మరిన్ని వార్తలు