అరుదైన విన్యాసాలతో కొత్త చరిత్ర

7 Oct, 2019 12:06 IST|Sakshi

స్టుట్‌గార్ట్‌ (జర్మనీ): ఐదుసార్లు ఒలింపిక్‌ విజేత, 14 సార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన అమెరికా జిమ్నాస్టిక్స్‌ సంచలనం సిమోన్‌ బైల్స్‌ మరోసారి అత్యద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా సరికొత్త ప‍్రదర్శనతో ఆటకే  వన్నె తెచ్చారు బైల్స్‌.  22 ఏళ్లకే ప్రపంచ జిమ్నాస్టిక్స్‌‌‌‌‌‌‌‌ క్వీన్‌‌‌‌‌‌‌‌గా పేరు తెచ్చుకున్న బైల్స్‌ ‌‌‌‌‌‌‌.. ఎన్నో పతకాలు ఖాతాలో వేసుకున్నారు. గుండె గుబేల్‌‌‌‌‌‌‌‌మనిపించే విన్యాసాలు చేసే ఈ అమ్మాయి.. తాజాగా వరల్డ్‌‌‌‌‌‌‌‌ ఆర్టిస్టిక్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో పోటీపడ్డ మొదటి రోజే చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శరతో చూపరులను ఆకట్టుకున్నారు.

గంటల వ్యవధిలో రెండు విన్యాసాలను తన పేరిట లిఖించుకున్నారు. ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ ఎక్సర్‌‌‌‌‌‌‌‌సైజ్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో బైల్స్‌‌‌‌‌‌‌‌.. ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ -డబుల్‌‌‌‌‌‌‌‌ స్కిల్‌‌‌‌‌‌‌‌ను ప్రదర్శించారు. దీనికి ‘బైల్స్‌‌‌‌‌‌‌‌ 2’అని పేరు పెట్టారు. ఆపై, బీమ్‌‌‌‌‌‌‌‌లో డబుల్‌‌‌‌‌‌‌‌-ట్విస్టింగ్‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌ టక్‌‌‌‌‌‌‌‌ డిస్మౌంట్‌‌‌‌‌‌‌‌ను ప్రదర్శన చేశాడు బైల్స్‌. జిమ్నాస్టిక్స్‌‌‌‌‌‌‌‌లో మొట్టమొదటగా చేసిన ఈ విన్యాసాన్ని ఇకపై‘ బైల్స్‌‌‌‌‌‌‌‌’అని పిలవనున్నారు.(ఇక్కడ చదవండి: భారత జిమ్నాస్ట్స్‌ విఫలం)

ఇటీవల జరిగిన యూఎస్‌ జిమ్నాస్ట్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఫ్లోర్‌ రొటీన్‌ ఈవెంట్‌లో అత్యంత క్లిష్టమైన ట్రిపుల్‌-డబుల్‌ విన్యాసం చేసిన బైల్స్‌ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఫ్లోర్‌ ఈవెంట్‌లో ట్రిపుల్‌-డబుల్‌ అంటే.. గాలిలోకి ఎగిరి కిందకు ల్యాండ్‌ అయ్యే క్రమంలో శరీరాన్ని రెండుసార్లు బ్యాక్‌ ఫ్లిప్‌ చేస్తూ మూడుసార్లు ట్విస్ట్‌ చేయడం. అత్యంత అరుదైన, సాహసోపేతమైన ఈ అద్భుత విన్యాసాన్ని 22 ఏళ్ల బైల్స్‌ ఆవిష్కృతం చేసి సంచలనం సృష్టించారు. తాజాగా ఈ అరుదైన విన్యాసాలను మరోసారి ప‍్రదర్శించి దానికి తన పేరునే లిఖించుకున్న బైల్స్‌ కొత్త చరిత్ర సృష్టించారు.

మరిన్ని వార్తలు