బ్లాక్‌ హాక్స్‌ హైదరాబాద్‌ సిద్ధం

25 Jan, 2019 10:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్రికెట్, బ్యాడ్మింటన్‌ తరహాలోనే వాలీబాల్‌ క్రీడలోనూ లీగ్‌ల సందడి మొదలైంది. ప్రేక్షకులకు అసలైన వాలీబాల్‌ మజాను అందించేందుకు ప్రొ వాలీబాల్‌ లీగ్‌ సిద్ధమైంది. ఫిబ్రవరి 2 నుంచి 22 వరకు జరుగనున్న ప్రొ వాలీబాల్‌ లీగ్‌ సీజన్‌–1తో వాలీబాల్‌ క్రీడాభిమానులకు మరింత చేరువ కానుంది. ఇందులో ఆరు జట్లు టైటిల్‌ కోసం తలపడనున్నాయి. అహ్మదాబాద్‌ డిఫెండర్స్, బ్లాక్‌ హాక్స్‌ హైదరాబాద్, కాలికట్‌ హెర్డెస్, చెన్నై స్పార్టన్స్, కొచ్చి బ్లూ స్పైకర్స్, యు ముంబా వాలీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఫిబ్రవరి 2న కొచ్చి వేదికగా యు ముంబా వాలీ, కొచ్చి బ్లూ స్పైకర్స్‌ జట్ల మధ్య జరుగనున్న తొలి మ్యాచ్‌తో లీగ్‌కు తెర లేవనుంది. తొలి సీజన్‌లోనే తమ సత్తా చాటేందుకు హైదరాబాద్‌ ఫ్రాంచైజీ బ్లాక్‌ హాక్స్‌జట్టు సిద్ధమైంది. అమెరికాకు చెందిన ప్రొఫెషనల్‌ వాలీబాల్‌ ప్లేయర్‌ కార్సన్‌ క్లార్క్, అంగముత్తు (యూనివర్సల్‌), అమిత్‌ కుమార్, రోహిత్‌ కుమార్, చిరాగ్, అలెక్స్‌(అటాకర్‌), సోను జకర్, గురమ్‌రీత్‌ పాల్, అశ్వల్‌ రాయ్‌ (బ్లాకర్‌), కమ్లేశ్‌ ఖటిక్‌ (లిబర్‌), నంది యశ్వం త్, ముత్తుస్వామి (సెట్టర్‌)లు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. జట్టు సభ్యులంతా గురువారం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో ప్రాక్టీస్‌ చేశారు.   

మరిన్ని వార్తలు