ఇప్పుడు ‘సూట్’ కాదు

8 Dec, 2016 23:39 IST|Sakshi

బీసీసీఐ సీఈవో రాహుల్ జొహ్రి ఇటాలియన్ సూట్ల ప్రతిపాదన తిరస్కరణ  
ముంబై: భారత క్రికెటర్లకు ఖరీదైన ఇటాలియన్ సూట్లను తెప్పించాలనే బీసీసీఐ సీఈవో రాహుల్ జొహ్రి ప్రతిపాదనకు చుక్కెదురైంది. ఒక్కోటి రూ.2.5 లక్షల విలువ చేసే వీటి కొనుగోలును బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. బీసీసీఐది కార్పోరెట్ కల్చర్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఆటగాళ్లతో పాటు బోర్డు ఉన్నతాధికారుల కోసమని 50 కొత్త ఇటాలియన్ డిజైన్ సూట్లను తెప్పించాలని ఠాకూర్‌తో పాటు కార్యదర్శి అజయ్ షిర్కే, ఇతర సభ్యులకు జొహ్రి నవంబర్ 19న ఈ-మెయిల్ చేశారు.

బీసీసీఐ చేసే ఖర్చుల విషయంలోనూ సుప్రీం కోర్టు పర్యవేక్షణ ఉండడం కూడా ఈ ప్రతిపాదన వెనక్కి వెళ్లడానికి ఓ కారణం. బోర్డుతో పాటు రాష్ట్ర క్రికెట్ సంఘాలు లోధా కమిటీ కొత్త ప్రతిపాదనలను అమలు చేసేవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే వీల్లేదు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం ఎలాంటి కొత్త ఒప్పందాలను చేసుకోలేము’ అని షిర్కే ఆయనకు సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు