ఆటగాళ్ల ఖర్చులకు డబ్బులివ్వని బోర్డు

9 Feb, 2017 00:12 IST|Sakshi
ఆటగాళ్ల ఖర్చులకు డబ్బులివ్వని బోర్డు

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోనే ధనవంతమైన క్రికెట్‌ బోర్డు... కానీ ప్రస్తుతం ఆటగాళ్ల రోజు ఖర్చులకు కూడా డబ్బులివ్వలేకపోతోంది. దీనికి రెండు కారణాలున్నాయి. కార్యదర్శి అజయ్‌ షిర్కేను సుప్రీంకోర్టు తప్పించడంతో చెక్‌లపై సంతకాలు చేసేవారు లేకపోవడం... నోట్ల రద్దు వల్ల పెద్ద మొత్తాన్ని విత్‌డ్రా చేయలేకపోవడం.

దీంతో కుర్రాళ్లు తమ సొంత ఖర్చులతో మ్యాచ్‌లాడారు. ఈ జూనియర్‌ జట్టుకు కోచ్‌ అయిన దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌ సహా సహాయక సిబ్బంది అంతా వారివారి ఖర్చులతో సిరీస్‌ను నెట్టుకొచ్చారు. చివరకు నెగ్గుకొచ్చారు. నగదు, చెక్‌ చెల్లింపుల సమస్య నిజమేనని బీసీసీఐ అధికారులు అంగీకరించారు. అయితే సిరీస్‌ ముగిసిన తర్వాత ఒకేసారి చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు