బోల్ట్ తప్పుకున్నాడు

26 Jun, 2015 08:47 IST|Sakshi
బోల్ట్ తప్పుకున్నాడు

కింగ్ స్టన్: పరుగుల చిరుత, జమైకా స్ప్లింటర్ ఉస్సేన్ బోల్ట్ మెల్లగా వెనుకబడి పోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. అతను ఈరోజు జమైకాలో జరగుతున్న జాతీయ పరుగు పందెం బరి నుంచి తప్పుకున్నాడని ఓ మీడియా సంస్థ తెలిపింది. ఈ పరుగు పందెం జాబితా చూస్తే అందులో బోల్ట్ పేరు లేదని, దాని గురించి వాకబు చేయగా ఆయన పరుగు పందెం నుంచి తప్పుకున్నాడని స్పష్టమైందని తెలిసింది.

వచ్చే ఆగస్టు బీజింగ్లో జరగనున్న ప్రపంచ చాంపియన్ షిప్ పోటీకి ట్రయల్ ల్లాంటి ఈ పోటీ నుంచి బోల్ట్ అనూహ్యంగా తప్పుకోవడం అందరినీ ఆలోచింపజేస్తుంది. గతంలో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో బోల్ట్ పేరిట అరుదైన రికార్డులు(100 మీ-10.12 సెకండ్లు), (200 మీ-20.13 సెకండ్లు) ఉన్నాయి. కాగా, గతవారం న్యూయార్క్లో జరిగిన డైమాండ్ లీగ్లో 200 మీటర్ల పరుగు పూర్తి చేసేందుకు 20.29 సెకన్ల సమయం తీసుకున్నాడు. దీంతో బోల్ట్ ఫిట్ నెస్పై అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్ బోల్ట్ అందుకోస్తాడా అని ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారట. 

>
మరిన్ని వార్తలు