జింబాబ్వే ఎన్నాళ్లకెన్నాళ్లకు

6 Nov, 2018 15:24 IST|Sakshi

సిల్హత్‌: జింబాబ్వే చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. మంగళవారం బంగ్లాదేశ్‌తో ముగిసిన తొలి టెస్టులో జింబాబ్వే 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. 321 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన బంగ్లాదేశ్‌ను 169 పరుగులకే కుప్పకూల్చిన జింబాబ్వే ఐదేళ్ల తర్వాత తొలి టెస్టు విజయాన్ని సాధించింది. ఏ దశలోనూ ఆతిథ్య బంగ్లాదేశ్‌ను కోలుకోనివ్వకుండా చేసి విజయాన్ని నమోదు చేసింది. ఇది జింబాబ్వే టెస్టు చరిత్రలో మూడో విదేశీ టెస్టు విజయం కాగా, 17 ఏళ్ల తర్వాత స్వదేశం వెలుపుల తొలి గెలుపును అందుకుంది.

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా ఇమ్రుల్‌ కైస్‌(43), అరిఫుల్‌ హక్‌(38), లిటన్‌ దాస్(23)లు మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించగా మిగతా వారు తీవ్రంగా నిరాశపరిచారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాండన్‌ మావుతా నాలుగు వికెట్లతో సత్తాచాటగా, సికందర్‌ రాజా మూడు వికెట్లు సాధించాడు.మసకజ్జాకు రెండు, జార్విస్‌కు వికెట్‌ లభించింది. ప్రస్తుతం రెండు రేటింగ్‌ పాయింట్లు మాత్రమే జింబాబ్వే ఖాతాలో ఉండగా, బంగ్లాదేశ్‌ 67 రేటింగ్‌ పాయింట్లతో ఉండటం గమనార్హం.

జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌ 282 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 181 ఆలౌట్‌

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ 143 ఆలౌట్‌, బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ 169 ఆలౌట్‌

మరిన్ని వార్తలు