సిరీస్ భారత్దే

13 Nov, 2016 16:21 IST|Sakshi
సిరీస్ భారత్దే

మూలపాడు(విజయవాడ):వెస్టిండీస్ మహిళలతో జరుగుతన్న మూడు వన్డేల సిరీస్ను భారత మహిళలు కైవసం చేసుకున్నారు. ఆదివారం ఇక్కడ ఏసీఏ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-0 తో చేజిక్కించుకుంది. విండీస్ విసిరిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 38.0 ఓవర్లలో ఛేదించింది.ఓపెనర్ స్మృతీ మందనా(44) ఆకట్టుకోగా, మరో ఓపెనర్ కామిని(2) నిరాశపరిచింది. ఆ తరువాత దీప్తి శర్మ(32), కెప్టెన్ మిథాలీ రాజ్(45)లు రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ 50.0 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. విండీస్ మహిళల్లో డాటిన్(63) హాఫ్ సెంచరీ సాధించగా,అగ్విల్లెరా(25) ఫర్వాలేదనిపించింది. జూలెన్ గోస్వామి, ఏక్తా బిస్త్, రాజేశ్వరి గైక్వాడ్లు తలో రెండు వికెట్లతో రాణించారు. తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక నామమాత్రమైన మూడో వన్డే నవంబర్ 16న జరుగనుంది.

మరిన్ని వార్తలు