పోరులో గాయపడి.. బాక్సర్ మృతి

1 Oct, 2016 08:34 IST|Sakshi
పోరులో గాయపడి.. బాక్సర్ మృతి

ఆటలు మరో క్రీడాకారుడి ప్రాణాలు తీశాయి. బాక్సింగ్ రింగ్‌లో తీవ్రంగా గాయపడిన స్కాటిష్ బాక్సర్ మైక్ టావెల్ ఆ తర్వాత మరణించాడు. ఇంతకుముందు అసలు ఎప్పుడూ అతడు ఓడిపోలేదు. తన ప్రొఫెషనల్ కెరీర్‌లో 11 విజయాలు, ఒక డ్రాతో అజేయంగా ఉన్నాడు. డండీకి చెందిన ఈ పాతికేళ్ల బాక్సర్.. గ్లాస్గోలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన సెయింట్ ఆం డ్రూస్ స్పోర్టింగ్ క్లబ్ ఫైట్‌లో డేల్ ఇవాన్స్‌తో తలపడిన టావెల్.. ఐదో రౌండు తర్వాత ఓడిపోయాడు. అప్పటికే తీవ్రంగా గాయపడిన అతడిని నగరంలోని క్వీన్ ఎలిజబెత్ యూనివర్సిటీ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

టావెల్ మరణించే సమయానికి అతడి కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. టావెల్ మృతిచెందిన విషయాన్ని సెయింట్ ఆండ్రూస్ స్పోర్టింగ్ క్లబ్ ఒక ట్వీట్‌లో నిర్ధారించింది. నిజానికి ఈ ఫైట్ మొదటి రౌండులోనే టావెల్ పడిపోయాడు. తర్వాత కాసేపటికి కోలుకుని, మళ్లీ మ్యాచ్ మొదలుపెట్టాడు. ఐదోరౌండు లో ఉండగా.. రెండోసారి టావెల్ నాక్ డౌన్ అవడంతో రిఫరీ విక్టర్ లాఫ్లిన్ పోరాటాన్ని ఆపేశారు. అంబులెన్సులో తీసుకెళ్లడానికి ముందే ఆక్సిజన్ పెట్టి, ప్రాథమిక చికిత్స చేశారు.

మరిన్ని వార్తలు