-

ఐఏబీఎఫ్ రెబల్ వర్గానికి విజేందర్ మద్దతు

7 Mar, 2014 01:31 IST|Sakshi
ఐఏబీఎఫ్ రెబల్ వర్గానికి విజేందర్ మద్దతు

న్యూఢిల్లీ: భారత బాక్సింగ్‌లో కొత్త సమాఖ్యగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్న రిటైర్డ్ బ్రిగేడియర్ పీకే మురళీధరన్ రాజాకు గట్టి మద్దతు లభించింది. ఒలింపిక్ కాంస్య పతక విజేత బాక్సర్ విజేందర్ సింగ్ ఈ రెబల్ వర్గానికి వెన్నంటి ఉంటానని ప్రకటించాడు. ప్రస్తుత కార్యనిర్వాహక సిబ్బంది ఆటకు మచ్చ తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారనే కారణంతో భారత బాక్సింగ్ సమాఖ్య (ఐఏబీఎఫ్) సభ్యత్వాన్ని ఐబా రద్దు చేసిన విషయం తెలిసిందే.
 
 వీరి స్థానంలో బాక్సింగ్ అభివృద్ధికి నిస్వార్థంగా సేవలందించగల వ్యక్తులు నూతన సమాఖ్యగా ఏర్పడేందుకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఐబా కోరింది. మాజీ ప్రధాన కార్యదర్శి రాజా ఈ మేరకు తన వర్గంతో అథ్లెట్స్ కమిషన్‌ను కలిశారు. ‘రాజా అతడి సిబ్బంది బాక్సింగ్‌ను ప్రక్షాళన చేస్తారని భావిస్తున్నాను. వారు ఇప్పటికే విశ్వాసాన్ని చూరగొన్నారు. ప్రస్తుత సంక్షోభం నుంచి ఈ క్రీడను సమర్థవంతంగా గట్టెక్కించగల సామర్థ్యం రాజా గ్రూపునకు ఉందని న మ్ముతున్నాను’ అని విజేందర్ అన్నాడు.
 

మరిన్ని వార్తలు