బాక్సర్‌ వికాస్‌కు హెచ్చరికతో సరి

21 Aug, 2017 01:00 IST|Sakshi
బాక్సర్‌ వికాస్‌కు హెచ్చరికతో సరి

న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌లో సెమీఫైనల్‌ బౌట్‌కు ముందు ‘వాకోవర్‌’ ఇచ్చిన భారత బాక్సర్‌ వికాస్‌ క్రిషన్‌పై క్రమశిక్షణ కమిటీ విచారణ ముగిసింది. ఈసారికి అతడిని హెచ్చరికతో వదిలేయాలని నిర్ణయించినట్టు భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) పేర్కొంది. ‘జరిగిన సంఘటనపై అతడిని హెచ్చరించాం. ఇక ఈ విషయం ఇంతటితో ముగిసింది. క్రమశిక్షణ కమిటీ అతడితో మాట్లాడింది. అతడి వాదన విన్నాక హెచ్చరిక సరిపోతుందని భావించారు’ అని బీఎఫ్‌ఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మేలో తాష్కెంట్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో కొరియన్‌ బాక్సర్‌తో తలపడాల్సి ఉండగా వికాస్‌ కారణం చెప్పకుండానే బౌట్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో అదే నెలలో జరిగిన వరల్డ్‌ సిరీస్‌ లో అతడికి ఆడే అవకాశం ఇవ్వకుండా, ఈ సంఘటనపై విచారణ కమిటీ నియమించారు.

మరిన్ని వార్తలు