పసిడికి పంచ్‌ దూరంలో...

31 Oct, 2019 04:27 IST|Sakshi

ఫైనల్లో శివ థాపా, ఆశిష్, పూజా రాణి

సెమీస్‌లో ఓడి కాంస్యం నెగ్గిన నిఖత్‌ జరీన్‌

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ టెస్ట్‌ ఈవెంట్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో రెండో రోజు భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. నిఖత్, సిమ్రన్‌జిత్, సుమీత్‌ సాంగ్వాన్, వహ్లిమ్‌పుయా సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకోగా... ముగ్గురు బాక్సర్లు శివ థాపా (63 కేజీలు), ఆశిష్‌ (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లి పసిడి పతకాలకు విజయం దూరంలో నిలిచారు. మహిళల 51 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ సెమీఫైనల్లో సనా కవానో (జపాన్‌) చేతిలో... 60 కేజీల విభాగంలో సిమ్రన్‌జిత్‌ కౌర్‌ కజకిస్తాన్‌ బాక్సర్‌ రిమ్మా వొలోసెంకో చేతిలో ఓడిపోయారు.పురుషుల విభాగం 91 కేజీల సెమీఫైనల్స్‌లో ఐబెక్‌ ఒరాల్‌బే (కజకిస్తాన్‌) చేతిలో సుమీత్‌ సాంగ్వాన్‌... 75 కేజీల విభాగంలో యుటో మొరివాకా (జపాన్‌) చేతిలో వహ్లిమ్‌పుయా ఓటమి చవిచూశారు. ఇతర సెమీఫైనల్స్‌లో దైసుకె నరిమత్సు (జపాన్‌)పై శివ థాపా; బీట్రిజ్‌ సోరెస్‌ (బ్రెజిల్‌)పై పూజా రాణి;  హిరోయాకి కిన్‌జియో (జపాన్‌)పై ఆశిష్‌ గెలిచి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు.   

మరిన్ని వార్తలు