అక్కడ బాక్సింగ్‌ మొదలైంది... 

27 Apr, 2020 02:11 IST|Sakshi

మనాగ్వా (నికరాగ్వా): కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్స్‌ ఈవెంట్‌లు నిరవధిక వాయిదా పడిన తరుణంలో... సెంట్రల్‌ అమెరికా దేశం నికరాగ్వాలో మాత్రం బాక్సింగ్‌ పోటీలు శనివారం తిరిగి మొదలయ్యాయి. దేశ రాజధాని అయిన మనాగ్వాలో జరిగిన ఎనిమిది బౌట్‌లను ప్రత్యక్షంగా, టీవీల ద్వారా ప్రేక్షకులు వీక్షించారు. అయితే ఈ బౌట్‌లకు వేదికగా నిలిచిన అలెక్సిస్‌ అర్గొయె జిమ్‌లో 8 వేల సీటింగ్‌ సామర్థ్యం ఉండగా... 10 శాతం మందే ప్రత్యక్షంగా వీక్షించారు. బౌట్‌లను తిలకించేందుకు వచ్చిన వారు భౌతిక దూరం పాటించారు. తమది పేద దేశమని బాక్సర్లకు పూట గడవాలంటే వారు బౌట్‌లో అడుగుపెట్టాల్సిందేనని టోర్నీ నిర్వాహకులు పేర్కొన్నారు. దాంతో పాటు తమకు కరోనా అంటే భయం లేదని కూడా వారన్నారు.  

మరిన్ని వార్తలు