బీబీసీకి బాయ్‌కాట్‌ గుడ్‌బై 

7 Jun, 2020 01:28 IST|Sakshi

కామెంటరీ నుంచి వైదొలిగిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

లండన్‌: బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ)తో 14 ఏళ్ల అనుబంధాన్ని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జెఫ్రీ బాయ్‌కాట్‌ తెంచుకున్నాడు. ‘బీబీసీ టెస్టు మ్యాచ్‌ ప్రత్యేక కామెంటరీ బృందం’ నుంచి 79 ఏళ్ల బాయ్‌కాట్‌తప్పుకున్నాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నా ఆరోగ్యం గురించి వాస్తవికంగా, నిజాయితీగా ఆలోచించాలి. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ఇటీవలే బైపాస్‌ సర్జరీ కూడా జరిగింది. 79 ఏళ్ల వయస్సులో ఇంకా వ్యాఖ్యాతగా వ్యవహరించడం కష్టమే’ అని బాయ్‌కాట్‌ తెలిపాడు. 

మరిన్ని వార్తలు