కోహ్లి ఇజ్జత్‌ తీసిన ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

18 May, 2019 17:00 IST|Sakshi

టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఆటలోనే కాదు సోషల్ మీడియాలో.. టీవీ యాడ్‌లలో యమా క్రేజ్ సంపాదించాడు. అందుకే కోహ్లితో ప్రకటనలు తీసేందుకు కార్పోరేట్‌ కంపెనీలు ఎగబడుతున్నాయి. అయితే ఇటీవలే కోహ్లి, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో కలిసి నటించిన ఓ ఫెయిర్‌నెస్ క్రీం ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ ప్రకటనపై తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాడ్జ్‌ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘అద్భుతం.. డబ్బుల కోసం మనుషులు ఏదైనా చేస్తారు’అంటూ ఈ ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ కోహ్లి పరువు తీశాడు. హాడ్జ్‌ ట్వీట్‌పై మండిపడిన కోహ్లి ఫ్యాన్స్‌ అతడిని విమర్శిస్తూ రీట్వీట్‌ చేయడం మొదలెట్టారు. దీంతో తన ట్వీట్‌కు వచ్చిన అనూహ్య స్పందనకు షాక్‌ అయిన హాడ్జ్‌ ‘నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు’అంటూ  మరో ట్వీట్‌ చేశాడు.
అయితే అసలు ఆ ప్రకటనలో ఏముందంటే.. కోహ్లీ.. పంత్‌లు పాట పాడుతుంటే అందులో అనుకోకుండా పంత్ మొటిమల గురించి ప్రస్తావన వస్తుంది. దానిని చూపిస్తూ ఓ ఫెయిర్ నెస్ క్రీం వాడు తగ్గిపోతుందని కోహ్లీ అంటాడు. వాడగానే మొటిమలు తగ్గిపోతాయి. ఇలా ఆ ప్రకటను ముగిసిపోతుంది.  ఈ వీడియోని విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. దీంతో నెటిజన్లు వీరిద్దరిపై తెగ ట్రోల్ చేస్తున్నారు. 'వీరిద్దరినీ 12నెలలు నిషేదించండి ప్లీజ్' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా... మరొక నెటిజన్ 'ఎవరైనా చూడడానికి ముందే ఈ వీడియోని డిలీట్ చేయి బ్రో' అని కామెంట్ పెట్టాడు. ఇంకో నెటిజన్ అయితే 'ఎవడైనా మొటిమల మీద పాట పాడతాడా.. మీరు తప్ప' అని వ్యంగ్యంగా కామెంట్ పెట్టాడు.

మరిన్ని వార్తలు