ధోని కూతురితో బ్రావో స్టెప్పులు..!!

17 May, 2018 08:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తూ తన వంతు వచ్చినప్పుడు ఆటలో సత్తా చూపించే ఆల్‌రౌండర్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు డ్వేన్‌ బ్రావో కూడా ఒకరు. 2016లో బ్రావో పాడిన ‘చాంపియన్స్‌’పాట ఎంత ఫేమస్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రావో ఆ పాటను ధోని, రైనా కూతుళ్లు జీవా, గ్రేసియాల కోసం మళ్లీ పాడారు.

దీంతో ఈ పాటకు జీవా, బ్రావోతో కలసి స్టెప్పులేసింది. కేవలం జీవానే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరికొంత మంది పిల్లలు కూడా డాన్స్‌ చేసి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్‌​ జట్టు తన అధికారిక ట్విటర్‌ అకౌంట్‌లో పోస్టు చేసింది.

మరిన్ని వార్తలు