ఫిఫా వరల్డ్‌ కప్‌ : మెక్సికోపై బ్రెజిల్‌ విజయం

2 Jul, 2018 21:46 IST|Sakshi
ఆనందంలో బ్రెజిల్‌ ఆటగాళ్లు

మాస్కో : ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన బ్రెజిల్‌ మరోసారి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. సోమవారం మెక్సికోతో జరిగిన ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లో 2-0తో విజయం సాధించింది. గ్రూప్‌ దశలో డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీని మట్టికరిపించిన మెక్సికో ఈ మ్యాచ్‌లో ఆ సంచలనాన్ని నమోదు చేయలేక పోయింది. కనీసం ఒక్క గోల్‌ కూడా నమోదు చేయకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి అర్థబాగం ఇరుజట్లు సమతూకంగా పోరాడాయి. సెకండాఫ్‌లో 51వ నిమిషంలో బ్రెజిల్‌ ఆటగాడు  నెమార్‌ గోల్‌ సాధించి తమ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి.

అయితే మెక్సికో ఆటగాళ్లు బంతిని తమ ఆదీనంలో ఉంచుకున్నప్పటికి గోల్స్‌ చేయడంలో విఫలమయ్యారు. ఇక మరికొద్ది క్షణాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా మిడ్‌ఫీల్డర్‌ కౌటిన్హో స్థానంలో వచ్చిన ఫర్మినో 88వ నిమిషంలో గోల్‌ సాధించడంతో ఆ జట్టు విజయం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లోని గోల్స్‌తో కలిపి బ్రెజిల్‌ మొత్తం ప్రపంచకప్‌ టోర్నీల్లో 228 గోల్స్‌ నమోదు చేసింది. ఓ జట్టుగా ఇవే అత్యధికం కావడం విశేషం.

మరిన్ని వార్తలు