ఫుట్బాల్లోనూ జాతి వివక్షా!

10 Mar, 2014 10:09 IST|Sakshi

వరుసపెట్టి బ్రెజిలియన్ క్రీడాకారులతో పాటు.. అధికారుల విషయంలో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగడంతో, ఫుట్బాల్లో జాతి వివక్షను బ్రెజిల్ అధ్యక్షుడు డిల్మా రౌసెఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆయనకు బ్రెజిల్ మాజీ మిడ్ ఫీల్డర్ అరౌకా కూడా మద్దతుపలికాడు. అరౌకా మార్చి 6వ తేదీన సావో పౌలో స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలలో ఆడుతుండగా ఓ అభిమాని అతడిని జాతిపేరుతో దూషించాడు.

ఆఫ్రికా ఖండం వెలుపల అత్యంత ఎక్కువగా నల్లజాతి జనాభా ఉన్న బ్రెజిల్ లాంటి దేశంలో ఇలా జాతివివక్ష ఉండటం ఏమాత్రం సరికాదని, దీన్ని అంగీకరించలేమని రౌసెఫ్ చెప్పారు. ఈ సంవత్పరం ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలు జరుగుతున్నప్పుడు జాతివివక్ష వ్యతిరేక సందేశాన్ని థీమ్గా తీసుకోవాలని కూడా ఆయన కోరారు. ఈ విషయమై ఇప్పటికే తాము ఐక్యరాజ్య సమితితోను, ఫిఫాతోను కూడా మాట్లాడినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు