ఒలింపిక్స్‌లో ‘బ్రేక్‌ డ్యాన్స్‌’

22 Feb, 2019 08:52 IST|Sakshi

పారిస్‌:  చక్కని చుక్కల సందిట బ్రేక్‌డ్యాన్స్‌... ఇలాంటి పాట సినిమాల్లోనే కాదు ఏకంగా ఒలింపిక్స్‌లో కూడా పాడుకోవచ్చేమో!  మన ప్రభుదేవాను పంపిస్తే స్వర్ణ పతకం గ్యారంటీగా వస్తుందేమో! ఎందుకంటే 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆతిథ్య దేశం ప్రతిపాదించిన నాలుగు కొత్త క్రీడల్లో ‘బ్రేక్‌ డ్యాన్స్‌’ కూడా ఒకటి కావడం విశేషం. దీంతో పాటు సర్ఫింగ్, క్లైంబింగ్, స్కేట్‌ బోర్డింగ్‌ పేర్లను కూడా ఫ్రాన్స్‌ ప్రతిపాదించింది. నిబంధనల ప్రకారం నిర్వాహక దేశం కొత్త క్రీడలను ప్రవేశపెట్టాల్సిందిగా ఐఓసీని కోరవచ్చు. 2024 ఒలింపిక్స్‌ ఆతిథ్యం దక్కించుకున్న పారిస్‌ బ్రేక్‌ డ్యాన్స్‌ను ఎంచుకుంది. ఇందులో భాగమయ్యేందుకు పోటీ పడిన స్క్వాష్, బిలియర్డ్స్, చెస్‌లకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. 2018లో బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన యూత్‌ ఒలింపిక్స్‌లో ‘బ్రేకింగ్‌’ పేరుతో బ్రేక్‌ డ్యాన్స్‌ పోటీలను నిర్వహించారు కూడా.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా