మెక్కల్లమ్ 'డబుల్' రికార్డు మిస్

26 Dec, 2014 18:29 IST|Sakshi
మెక్కల్లమ్ 'డబుల్' రికార్డు మిస్

క్రైస్ట్చర్చ్: శ్రీలంకతో జరుగుతున్న శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు నష్టపోయి 429 పరుగులు చేసింది.

కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ విజృభించి ఆడాడు. 5 పరుగులతో తేడాతో అతడు డబుల్ సెంచరీ కోల్పోయాడు. 134 బంతుల్లో 18 ఫోర్లు, 11 సిక్సర్లతో 195 పరుగులు సాధించాడు. డబుల్ సెంచరీ చేస్తే టెస్టుల్లో అత్యంత వేగంగా ద్విశతకం సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కేవాడు.

విలియమ్సన్(54), నీషమ్(85) అర్థ సెంచరీలు చేశారు. లాథమ్ 27, రూథర్ఫోర్డ్ 18, వాల్టింగ్ 26 పరుగులు చేశారు. రాస్ టేలర్(7) రనౌట్ అయ్యాడు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ 2 వికెట్లు తీశాడు. లక్మాల్, ఎరంగ, ప్రసాద్, కౌషాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

మరిన్ని వార్తలు