స్టువర్ట్‌ బ్రాడ్‌ సెన్సేషనల్‌ రికార్డు

26 Dec, 2019 19:57 IST|Sakshi

సెంచూరియన్‌: ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ ఒక సెన్సేషనల్‌ రికార్డు సృష్టించాడు. ఈ దశాబ్దంలో నాలుగు వందల వికెట్లను సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు. సహచర బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. ఈ దశాబ్దంలో బ్రాడ్‌ 400 టెస్టు వికెట్లును సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఆ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ వికెట్‌ను తీసిన తర్వాత బ్రాడ్‌ ఈ ఫీట్‌ను సాధించాడు.(ఇక‍్కడ చదవండి: క్రికెట్‌ చరిత్రలో తొలి బౌలర్‌గా..)

ఈ దశాబ్దంలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో అండర్సన్‌ 428 వికెట్లతో టాప్‌లో నిలవగా, ఆ తర్వాత బ్రాడ్‌ నిలిచాడు. ఓవరాల్‌గా తమ టెస్టు  కెరీర్‌లో అండర్సన్‌ ఇప్పటివరకూ 576 వికెట్లు సాధించగా, బ్రాడ్‌ 473 వికెట్లు తీశాడు. కాగా, ఈ దశాబ్దంలో అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో అండర్సన్‌, బ్రాడ్‌ల తర్వాత స్థానంలో ముగ్గురూ స్పిన్నర్లే ఉన్నారు. ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌(376) మూడో స్థానంలో ఉండగా, శ్రీలంక స్పిన్నర్‌ రంగనా హెరాత్‌(363) నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(362) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బ్రాడ్‌ తన తొలి వికెట్‌గా హమ్జాను పెవిలియన్‌కు పంపాడు.(ఇక్కడ చదవండి: ఈ దశాబ్దపు ఐదో బౌలర్‌గా ఘనత)

మరిన్ని వార్తలు