ఒలింపిక్స్‌ బిడ్‌ నుంచి తప్పుకున్న బుడాపెస్ట్‌

24 Feb, 2017 00:52 IST|Sakshi

బుడాపెస్ట్‌: ఒలింపిక్స్‌ లాంటి మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చిన ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి ఇటీవల ఎంతగానో దిగజారడం మనకు కనిపిస్తోంది.  హంగేరీ ఈ విషయాన్ని తొందరగానే గుర్తించింది. 2024 ఒలింపిక్స్‌ నిర్వహణ బిడ్‌ నుంచి తమ నగరం బుడాపెస్ట్‌ తప్పుకుంటున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది.

పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని వినియోగించాల్సి వస్తుంది కాబట్టి 2024లో దేశ రాజధాని బుడాపెస్ట్‌లో ఈ క్రీడలకు ఆతిథ్యమివ్వా లా? వద్దా? అనే అంశంపై పౌరుల నిర్ణయాన్ని తెలపాలని కోరింది. ఒలిం పిక్స్‌ నిర్వహణను వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ఓట్లు పోలవడంతో బుడాపెస్ట్‌... ఒలింపిక్స్‌ బిడ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది.

>
మరిన్ని వార్తలు