కేప్‌టౌన్‌లో బుమ్రాను ఆడించాలి: నెహ్రా

29 Dec, 2017 00:53 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌లో జరిగే తొలి టెస్టులో యువ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఆడించాలని మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా అన్నారు. ‘టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మదిలో ఏముందో నాకైతే తెలీదు... కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ వికెట్‌ బుమ్రాకు సరిగ్గా నప్పుతుంది. రంజీల్లో గుజరాత్‌ తరఫున అద్భుతమైన యార్కర్‌లతో చెలరేగాడు. అతని బౌలింగ్‌ శైలి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా సుదీర్ఘమైన స్పెల్స్‌ వేయగలడు. ఇవన్నీ సఫారీ గడ్డపై అతనికి కలిసొస్తాయి’ అని నెహ్రా విశ్లేషించారు.

ఈ జనవరిలో కేప్‌టౌన్‌ వాతావరణం ఎండవేడిమితో ఉంటుందని, సీమర్లకు ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే షమీ, ఇషాంత్‌ల తర్వాతే మూడో సీమర్‌ ఎవరనే చర్చ ఉంటుందని చెప్పారు. ఇషాంత్‌ తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను అదేపనిగా అసహనానికి గురి చేస్తాడని, దీనివల్ల మరో ఎండ్‌లో బౌలర్‌కు దొరికిపోతారన్నారు. 

మరిన్ని వార్తలు