సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో భారత పేసర్ హ్యాట్రిక్ వికెట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్లో అఫ్గాన్‌కు 16 పరుగులు కావాల్సి తరుణంలో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి వరుసగా మూడు వికెట్లతో అదరగొట్టాడు. అయితే తన ప్రదర్శన కారణం సహచర బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక కారణంగా షమీ తెలిపాడు.( ఇక్కడ చదవండి: భారత్ అజేయభేరి)
మ్యాచ్ తర్వాత షమీ మాట్లాడుతూ.. ‘ నా చివరి ఓవర్ ప్రణాళిక సమర్థవంతంగా నిర్వహించడానికి బుమ్రానే కారణం. చివరి రెండు ఓవర్లలో అఫ్గాన్ విజయానికి 21 పరుగులు కావాలి. ఆ సమయంలో 49 ఓవర్ వేసిన బుమ్రా ఐదు పరుగులే ఇచ్చాడు. ఆ క్రమంలోనే ఆఖరి ఓవర్లో అఫ్గాన్‌కు 16 పరుగులు అవసరమయ్యాయి. మ్యాచ్‌ను కాపాడుకోవడానికి బుమ్రా బాటలు వేసి వెళ్లాడు. దాంతోనే నా ప్రణాళిక సునాయాసమైంది. ఇక్కడ మొత్తం క్రెడిట్ బుమ్రాకే దక్కుతుంది’ అని షమీ తెలిపాడు. ఇక తన ఓవరాల్ బౌలింగ్ ప్రదర్శనపై షమీ సంతృప్తి వ్యక్తం చేశాడు. తన బౌలింగ్‌ను చాలా ఎంజాయ్ చేశానని షమీ.. ఇది చాలా క్లిష్టమైన మ్యాచ్‌గా అభివర్ణించాడు. ఒక సాధారణ లక్ష్యాన్ని కాపాడుకుని విజయం సాధించడం జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందన్నాడు. తమ బౌలింగ్ యూనిట్ బలంగా ఉందనడానికి ఈ తరహా మ్యాచ్ ఒక ఉదాహరణగా షమీ పేర్కొన్నాడు.