టీమ్ ఓటమికి ఇద్దరమే బాధ్యులమా?

23 Oct, 2016 10:43 IST|Sakshi
టీమ్ ఓటమికి ఇద్దరమే బాధ్యులమా?

సిడ్నీ: శ్రీలంక చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమికి తనతో పాటు జోయ్ బర్న్స్ ను బలిపశువులు చేశారని ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అన్నాడు. ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ లో లంక గడ్డపై వారి చేతిలో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్ 3-0తో వైట్ వాట్ అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ రెండు టెస్టుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆసీస్ ఆటగాడు ఒక్క కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రమేనని మీడియాకు తెలిపాడు. ఉపఖండంలో లంక లాంటి టఫ్ పిచ్ లపై కేవలం రెండు టెస్టుల్లో రాణించలేనంత మాత్రానా కొందరిపై ఓటమి ప్రభావాన్ని చూపడం సరికాదని ఆసీస్ క్రికెట్ బోర్డును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

తాజాగా వన్డేల్లో దక్షిణాఫ్రికా చేతిలో 5 వన్డేల సిరీస్ లో ఆసీస్ వైట్ వాష్ కాలేదా అని ప్రశ్నించాడు. ఈ సిరీస్ కు ముందు న్యూజిలాండ్, వెస్టిండీస్ పర్యటనలలో వన్ డౌన్ బ్యాట్స్ మన్ గా తాను అద్బుత ఇన్నింగ్స్ లు ఆడినట్లు గుర్తుచేశాడు. అయితే ఈ విషయాలను పట్టించుకోని ఆసీస్ క్రికెట్ బోర్టు ఆ సిరీస్ లో మూడో టెస్టులో తనను పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తంచేశాడు. తనతో పాటు మరో టాపార్డర్ బ్యాట్స్ మన్ బర్న్స్ ఘోర వైఫల్యాలే జట్టు ఓటమికి కారణమని ఆరోపణలు రావడం దారుణమన్నాడు.  వాస్తవానికి తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ ల్లో కలిపి ఖవాజా కేవలం 55 పరుగులు చేశాడని చివరిదైన మూడో టెస్టులో జట్టు నుంచి తప్పించారు.

మరిన్ని వార్తలు