ట్యాంపరింగ్‌కు యత్నించిన ఆసీస్‌ ప్లేయర్‌!

24 Mar, 2018 20:46 IST|Sakshi

బెన్‌క్రాఫ్ట్‌ ప్యాంట్‌లో ఏముంది?

కేప్‌టౌన్‌ : వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా టెస్ట్‌ సిరీస్‌లో మరో వివాదానికి తెరలేచింది. ఇప్పటికే రబడ-స్మిత్‌, వార్నర్‌-డికాక్‌ల మధ్య  స్లెడ్జింగ్‌ శృతి మించడంతో ఐసీసీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా  కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్‌ ఆటగాడు బెన్‌ క్రాప్ట్‌ మైదానంలో ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది.

ఆట మధ్యలో ప్యాంట్‌లో పసుపు రంగు వస్తువును దాచడం కెమెరాల్లో స్పష్టం అయింది. అతను బాల్‌ ట్యాంపరింగ్‌ యత్నించాడని ఫీల్డ్‌ అంపైర్లకు ఫిర్యాదు రావడంతో ఆట మధ్యలోనే అతన్ని పిలిచి వివరణ కోరగా ఏమి లేదని బంతిని తుడిచే నల్లటి వస్త్రం అని చూపించాడు. దీనికి సంతృప్తి చెందిన అంపైర్లు ఆటను కొనసాగించారు. అయితే తొలుత కెమెరాల్లో కనిపించిన వస్తువు.. తీరా అంపైర్ల  చూపించినది వేరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం బెన్‌ వీడియో నెట్టింట్లో  వైరల్‌ అయింది. 

రివర్స్‌ స్వింగ్‌ కోసం ఆసీస్‌ ఆటగాళ్లు బాల్‌ ట్యాంపరింగ్‌ యత్నించారని, సఫారీ బ్యాట్స్‌మెన్‌పై పైచేయి సాధించాలని ఇలా అడ్డదార్లు తొక్కారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

>
మరిన్ని వార్తలు