కేట్ క్యాంపబెల్ సరికొత్త రికార్డు

2 Jul, 2016 18:29 IST|Sakshi
కేట్ క్యాంపబెల్ సరికొత్త రికార్డు

బ్రిస్బేన్: రియో ఒలింపిక్స్కు ముందు ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్ కేట్ క్యాంపబెల్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. బ్రిస్బేన్లో శనివారం జరిగిన 100 మీటర్ల ఫ్రీ స్టైయిల్లో 52.06 సెకెండ్లలో లక్ష్యాన్ని చేరుకుని సరికొత్త ఫీట్ను సాధించింది.  తద్వారా 100 మీటర్ల ఫ్రీ స్టైయిల్లో  ఇప్పటివరకూ జర్మన్ స్విమ్మర్  బ్రిట్టా స్టెఫెన్స్ పేరిట ఉన్న రికార్డును తెరమరుగైపోయింది.

 

2009 లో రోమ్ గేమ్స్లో బ్రిట్టా  52.07 సెకన్లలో  నమోదు చేసిన రికార్డును క్యాంప బెల్ సవరించింది. దీంతో రియో ఒలింపిక్స్ కు ముందు క్యాంపబెల్ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. 2008, 2012 ఒలింపిక్స్ లలో క్యాంప్ బెల్ కాంస్య పతకాలను సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు