‘బీసీసీఐ.. నన్ను మిస్సవుతున్నారు’

8 Aug, 2019 16:30 IST|Sakshi

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. తొలి రెండు టీ20ల్లో విఫలమైన యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌.. చివరి టీ20లో మాత్రం చెలరేగి ఆడాడు. 42 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 65 పరుగులు సాధించి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.  మ్యాచ్‌ అనంతరం ఓపెనర్‌ రోహిత్‌శర్మ.. వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషబ్‌పంత్‌ను ఇంటర్వ్యూ చేసిన వీడియో బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ఆ ట్వీట్‌కు యువ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ సరదా వ్యాఖ్యలు జోడించి రీట్వీట్‌ చేశాడు.

‘మిస్సింగ్‌ మీ’  అంటూ బీసీసీఐని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. సహజంగా చహల్‌ టీవీ ద్వారా అతడే టీమిండియా ఆటగాళ్లని ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోలను  అభిమానులతో పంచుకుంటాడు. ఈసారి రోహిత్‌ తన పాత్ర పోషించాడు. దీంతో స్పందించిన చహల్‌ అందుకు సరదాగా రిప్లూ ఇచ్చాడు.  పంత్‌ వీడియోలో మాట్లాడుతూ.. తన ఆటమీద నమ్మకముందని, అందుకు తగ్గట్టే కొన్ని మ్యాచ్‌ల్లో రాణించకపోయినా మూడో టీ20లో మంచి బ్యాటింగ్‌ చేశానని చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా