చాంపియన్ భారత్

28 Apr, 2015 01:13 IST|Sakshi
చాంపియన్ భారత్

ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నీ
 
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో తొలిసారి భారత జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఇండోనేసియాలో ముగిసిన ఈ టోర్నమెంట్‌లో భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించి 33 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. పురుషుల విభాగంలో రాకేశ్ కుమార్ (69 కేజీలు), హర్పాల్ సింగ్ (75 కేజీలు) పసిడి పతకాలు నెగ్గగా... మనీశ్ కుమార్ (60 కేజీలు) కాంస్య పతకం సాధించాడు.

ఆదివారం మహిళల విభాగంలో సర్జూబాల (48 కేజీలు), పింకీ జాంగ్రా (51 కేజీలు) కూడా పసిడి పతకాలు నెగ్గిన సంగతి తెలిసిందే. ‘ప్రెసిడెంట్స్ కప్‌లో తొలిసారి భారత్ చాంపియన్‌గా నిలి చింది. ఈ ప్రదర్శన భారత బాక్సింగ్ పురోగతికి నిదర్శనం’ అని చీఫ్ కోచ్ జీఎస్ సంధూ తెలిపారు. ఈ టోర్నీలో 30 దేశాల నుంచి 130 మంది బాక్సర్లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు