చాంపియన్స్‌ హెచ్‌సీఏ ఎలెవన్‌

1 Sep, 2017 00:40 IST|Sakshi
చాంపియన్స్‌ హెచ్‌సీఏ ఎలెవన్‌

మొయినుద్దౌలా గోల్డ్‌కప్‌ కైవసం
∙ ఫైనల్లో 7 వికెట్లతో ఓడిన ఎయిరిండియా


హైదరాబాద్‌: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హెచ్‌సీఏ ఎలెవన్‌ జట్టు సత్తాచాటింది. ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. గురువారం ఎయిరిండియాతో జరిగిన ఫైనల్లో హెచ్‌సీఏ ఎలెవన్‌ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఎయిరిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 267 పరుగులు చేసింది. నమన్‌ ఓజా (62), మన్విందర్‌ బిస్లా (56) అర్ధసెంచరీలు చేశారు.

అనంతరం హెచ్‌సీఏ ఎలెవన్‌ 47.1 ఓవర్లలో 3 వికెట్లకు 273 పరుగులు చేసి గెలిచింది. తన్మయ్‌ అగర్వాల్‌ (84), బి. సందీప్‌ (71), కె. సుమంత్‌ (60 నాటౌట్‌) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. విజేతగా నిలిచిన హెచ్‌సీఏ ఎలెవన్‌ జట్టుకు రూ. 5లక్షలు, రన్నరప్‌గా నిలిచిన ఎయిరిండియాకు రూ. 3లక్షల ప్రైజ్‌మనీ లభించింది.  

మరిన్ని వార్తలు