‘రాయల్’గా సెమీస్‌కి..

30 Sep, 2013 01:48 IST|Sakshi
‘రాయల్’గా సెమీస్‌కి..

 జైపూర్: సమీకరణాలతో సంబంధం లేకుండా... మిగిలిన జట్ల ఫలితాలతో పట్టింపు లేకుండా... రాజస్థాన్ రాయల్స్ జట్టు చాంపియన్స్‌లీగ్ సెమీఫైనల్‌కు చేరింది. టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అలవోకగా నెగ్గి... మరో మ్యాచ్ మిగిలుండగానే నాకౌట్ సమరానికి అర్హత సాధించింది. ఆదివారం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ద్రవిడ్ సేన 9 వికెట్ల తేడాతో పెర్త్ స్కార్చర్స్‌ను చిత్తు చేసింది.
 
 టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా... పెర్త్ 20 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటయింది. వోజస్ (27) టాప్ స్కోరర్. రాజస్థాన్ బౌలర్లు కూపర్ (4/18), తాంబె (2/17), ఫాల్కనర్ (2/16) పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ ముగ్గురూ కలిసి 12 ఓవర్లలో కేవలం 51 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లు తీశారు.
 
 రాజస్థాన్ రాయల్స్ జట్టు 16.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 121 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. ద్రవిడ్ (0) నిరాశపరిచినా... రహానే (53 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శామ్సన్ (42 బంతుల్లో 50 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. కూపర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

చాంపియన్స్ లీగ్‌లో ముంబై సెమీఫైనల్ భవిష్యత్తు రాజస్థాన్ రాయల్స్‌పై ఆధారపడి ఉంది. రాయల్స్ ఇప్పటికే 12 పాయింట్లతో సెమీస్‌కు చేరింది. ఒటాగో 10 పాయింట్లతో ఉంది. ముంబైకి కేవలం ఆరు పాయింట్లే ఉన్నాయి. తమ చివరి మ్యాచ్‌ను బుధవారం ముంబై పెర్త్‌తో ఆడాలి.
 
 ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే 10 పాయింట్లకు చేరుతుంది. మరోవైపు ఒటాగో, రాజస్థాన్ తమ చివరి మ్యాచ్‌ను మంగళవారం ఆడతాయి. ఒకవేళ ఇం దులో ఒటాగో గెలిస్తే... ముంబై ఇంటికే. రాజస్థాన్ గెలిస్తే మాత్రం... ఒటాగో, ముంబై పదేసి పాయిం ట్లతో ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు సెమీస్‌కు చేరుతుంది. కాబట్టి రాజస్థాన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఒటాగోను భారీ తేడాతో ఓడిస్తేనే... ముంబైకి అవకాశాలు ఉంటాయి.
 
ముంబై భవిత రాయల్స్ చేతుల్లో

 స్కోరు వివరాలు
 పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్: డేవిస్ (సి) కూపర్ (బి) ఫాల్కనర్ 18; ఎగర్ (సి) మాలిక్ (బి) వాట్సన్ 10; కాటిచ్ (స్టం) శామ్సన్ (బి) తాంబె 12; వోజస్ (సి) ఫాల్కనర్ (బి) కూపర్ 27; కార్ట్‌రైట్ ఎల్బీడబ్ల్యు (బి) కూపర్ 5; టర్నర్ (బి) కూపర్ 11; ట్రిఫిట్ (సి) అండ్ (బి) తాంబె 2; పారిస్ (బి) ఫాల్కనర్ 2; మెన్నీ (సి) బిన్నీ (బి) కూపర్ 2; బెహ్రన్‌డార్ఫ్ నాటౌట్ 12; బీర్ రనౌట్ 3; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 120.
 
 వికెట్ల పతనం: 1-18; 2-29; 3-62; 4-76; 5-77; 6-80; 7-85; 8-97; 9-97; 10-120.
 బౌలింగ్: మేనరియా 2-0-11-0; విక్రమ్‌జీత్ మాలిక్ 2-0-22-0; ఫాల్కనర్ 4-0-16-2; వాట్సన్ 3-0-23-1; బిన్నీ 1-0-7-0; తాంబె 4-0-17-2; కూపర్ 4-0-18-4.
 
 రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ద్రవిడ్ (బి) బెహ్రన్‌డార్ఫ్ 0; రహానే నాటౌట్ 62; శామ్సన్ నాటౌట్ 50; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (16.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 121.
 
 వికెట్ పతనం: 1-1.
 బౌలింగ్: బెహ్రన్‌డార్ఫ్ 4-0-28-1; పారిస్ 4-0-28-0; మెన్నీ 2.3-0-22-0 ; బీర్ 4-0-26-0; కార్ట్‌రైట్ 1-0-10-0; ఎగర్ 1-0-6-0.
 
 చాంపియన్స్ లీగ్‌లో నేడు
 టైటాన్స్   x ట్రినిడాడ్
 సా. గం. 4.00 నుంచి
 బ్రిస్బేన్ x సన్‌రైజర్స్
 రా. గం. 8.00 నుంచి
 వేదిక: అహ్మదాబాద్
 స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
మరిన్ని వార్తలు