బిస్బేన్ హీట్పై ట్రినిడాడ్ గెలుపు

22 Sep, 2013 19:53 IST|Sakshi

చాంపియన్స్ లీగ్లో భాగంగా ఆదివారమిక్కడ జరిగిన మ్యాచ్లో బిస్బేన్ హీట్తో జరిగిన మ్యాచ్లో ట్రినిడాడ్ అండ్ టొబాగొ విజయం సాధించింది. 25 పరుగుల తేడాతో బిస్బేన్ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రినిడాడ్ నిర్ణీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. కెప్టెన్ రామ్దిన్ 48 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.

136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బిస్బేన్ 18.4 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటయింది. బర్న్స్(45) ఒక్కడే రాణించాడు. ట్రినిడాడ్ బౌలర్లలో రామ్పాల్ 4, ఎమ్రిట్ 2, నరైన్ 2 వికెట్లు పడగొట్టారు. రామ్దిన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు.

మరిన్ని వార్తలు