కశ్వి గౌతమ్‌ రికార్డ్‌: 29 బంతుల్లో 10 వికెట్లు

25 Feb, 2020 16:53 IST|Sakshi

సాక్షి, కడప: చండీగఢ్‌ అమ్మాయి కశ్వి గౌతమ్‌ అద్భుతం చేసింది. ఏకంగా పది వికె​ట్లు పడగొట్టి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. బీసీసీఐ అండర్ 19 వన్డే మహిళా క్రికెట్ ట్రోఫీలో చండీగఢ్‌ జట్టు కెప్టెన్‌ కశ్వి గౌతమ్‌ 10 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. స్థానిక కేఎస్‌ఆర్‌ఎం కళాశాల మైదానంలో మంగళవారం అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ ఘనత సాధించింది. కశ్వి గౌతమ్‌ విజృంభణతో చండీగఢ్‌ 161 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన చండీగఢ్‌ టీమ్‌ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కశ్వి గౌతమ్‌ 49, సిమ్రన్‌ జోహల్‌ 42, మెహుల్‌ 41 పరుగులతో రాణించారు. (చదవండి: టెస్టు ఓటమి.. ప్రశ్నల వర్షం)

తర్వాత బ్యాటింగ్‌ దిగిన అరుణాచల్‌ప్రదేశ్‌ కేవలం 8.5 ఓవర్లలో 25 పరుగులకే కుప్పకూలింది. మేఘా శర్మ (10) ఒక్కరే నాటౌట్‌గా నిలిచారు. ఎనిమిది మంది డకౌట్‌ అయ్యారు. కశ్వి గౌతమ్‌ 4.5 ఓవర్లలో 12 పరుగులిచ్చి మొత్తం 10 వికెట్లు పడగొట్టింది. 29 బంతుల్లో అరుణాచల్‌ప్రదేశ్‌ జట్టును పెవిలియన్‌కు పంపింది. ఇందులో ఆరు ఎల్బీడబ్ల్యూలు, నాలుగు క్లీన్‌బౌల్డ్‌లు ఉన్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విజృంభించిన కశ్వి గౌతమ్‌ తన జట్టుకు ఒంటిచేత్తో భారీ విజయాన్ని అందించింది. (చదవండి: సిగ్గు పడాల్సిందేమీ లేదు: కోహ్లి)

మరిన్ని వార్తలు