చరణ్, తిలక్‌ సెంచరీలు

5 Jul, 2018 10:15 IST|Sakshi

ఇన్‌కంట్యాక్స్‌ 279/5

హెచ్‌సీఏ మూడు రోజుల క్రికెట్‌ లీగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఓపెనర్‌ ఎంఎస్‌ఆర్‌ చరణ్‌ (192 బంతుల్లో 111; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో అదరగొట్టడంతో హెచ్‌సీఏ ఎ–1 డివిజన్‌ మూడు రోజుల లీగ్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఇన్‌కంట్యాక్స్‌ జట్టు దీటుగా బదులిస్తోంది. బుధవారం ఆట ముగిసే సమయానికి ఇన్‌కంట్యాక్స్‌ 93.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. చేతిలో మరో ఐదు వికెట్లు ఉన్న ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 112 పరుగులు వెనుకబడి ఉంది. ఎస్‌బీఐ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 14/1తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇన్‌కంట్యాక్స్‌ జట్టును చరణ్‌ ఆదుకున్నాడు. రక్షణ్‌ రెడ్డి (182 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తో కలిసి రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించి మంచి పునాది వేశాడు. ఓ వైపు చరణ్‌ బౌండరీలతో చెలరేగుతుంటే రక్షణ్‌ మాత్రం చాలా నెమ్మదిగా ఆడాడు. ఆ తర్వాత వంశీ వర్ధన్‌ రెడ్డి (60; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), షాదాబ్‌ తుంబి (54 బ్యాటింగ్‌; 8 ఫోర్లు) కూడా రాణించడంతో ఇన్‌కంట్యాక్స్‌ మంచి స్థితిలో నిలిచింది. ప్రత్యర్థి బౌలర్లలో రవికిరణ్, డానియల్‌ మనోహర్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.  

తిలక్‌ వర్మ జోరు...

ఎంపీ కోల్ట్స్‌తో జరుగుతున్న మరో మ్యాచ్‌లో జెమిని ఫ్రెండ్స్‌ జట్టు బ్యాట్స్‌మన్‌ ఠాకూర్‌ తిలక్‌వర్మ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. తిలక్‌ సెంచరీ కారణంగా జెమిని ఫ్రెండ్స్‌ ఆట ముగిసే సమయానికి ఎనిమిది వికెట్లకు 275 పరుగులు చేసింది.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు


కాంటినెంటల్‌ సీసీ తొలి ఇన్నింగ్స్‌: 80, ఏఓసీ: 341/9 డిక్లేర్డ్‌ (ఇర్ఫాన్‌ ఖాన్‌ 40, లలిత్‌ మోహన్‌ 4/101) కాంటినెంటల్‌ సీసీ రెండో ఇన్నింగ్స్‌: 170 (హృషికేశ్‌ 39, సంహిత్‌ రెడ్డి 40; సచిన్‌ షిండే 4/30, సాగర్‌ శర్మ 3/40).

ఈఎమ్‌సీసీ: 267, స్పోర్టింగ్‌ ఎలెవన్‌: 207/9 (భవేశ్‌ సేత్‌ 112, విఘ్నేశ్‌ అగర్వాల్‌ 3/26).

ఎవర్‌గ్రీన్‌ తొలి ఇన్నింగ్స్‌: 280, ఎన్స్‌కాన్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 172 (మెహదీ హసన్‌ 97, మొహమ్మద్‌ అజహర్‌ 37; నవీన్‌ 3/83, ప్రణీత్‌రెడ్డి 3/41), ఎవర్‌గ్రీన్‌ రెండో ఇన్నింగ్స్‌: 139/2 (జి. విక్రమ్‌ నాయక్‌ 41, బి. మనోజ్‌ కుమార్‌ 70 బ్యాటింగ్‌).
ఎంపీ కోల్ట్స్‌: 257, జెమిని ఫ్రెండ్స్‌: 275/8 (ఎం. అభిరత్‌ రెడ్డి 47, ఠాకూర్‌ తిలక్‌ వర్మ 129 బ్యాటింగ్, రచ్‌నేశ్‌ దూబే 32, గిరీశ్‌ గౌడ్‌ 3/51, ఆకాశ్‌ 3/17).
డెక్కన్‌ క్రానికల్‌ తొలి ఇన్నింగ్స్‌: 251, ఆంధ్రాబ్యాంక్‌ తొలి ఇన్నింగ్స్‌: 73 (టీపీ అనిరుధ్‌ 5/27, ఎం. పృథ్వీ 3/37), డెక్కన్‌ క్రానికల్‌ రెండో ఇన్నింగ్స్‌: 152/7 (పి. సాయి వికాస్‌ రెడ్డి 68).  

ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ: 309/9 (రఫూస్‌ రోడ్రిగ్స్‌ 33 నాటౌట్, సుదీప్‌ త్యాగి 3/57, ఆకాశ్‌ సన 3/71) బీడీఎల్‌: 227/9 (ప్రతీక్‌ పవార్‌ 40, కె. సుమంత్‌ 56, షేక్‌ ఖమ్రుద్దీన్‌ 4/39).

ఇండియా సిమెంట్స్‌: 298, హైదరాబాద్‌ బాట్లింగ్‌: 313/5 (సాయి ప్రణయ్‌ 39, రోహన్‌ 75, రవిందర్‌ 104 బ్యాటింగ్, నిఖిల్‌ 31 బ్యాటింగ్‌).  

దయానంద్‌ సీసీ: 371 (భగత్‌ వర్మ 71, కార్తికేయ 3/57), జై హనుమాన్‌: 181/5 (జి. వినీత్‌ రెడ్డి 35, జి. శశిధర్‌ రెడ్డి 30, ఎన్‌. సూర్య తేజ 45 బ్యాటింగ్‌).


 

మరిన్ని వార్తలు