హైదరాబాద్కు షాకిచ్చిన చెన్నై

22 Jul, 2016 09:57 IST|Sakshi
హైదరాబాద్కు షాకిచ్చిన చెన్నై

యూబీఏ ప్రొ బాస్కెట్‌బాల్ లీగ్
పుణే: యూబీఏ ప్రొ బాస్కెట్‌బాల్ లీగ్‌లో హైదరాబాద్ స్కై జట్టు 93-107 స్కోరు తేడాతో చెన్నై స్లామ్ చేతిలో పరాజయం చవిచూసింది. ఇక్కడి బాలేవడి ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన ఈ లీగ్ పోరులో చెన్నై ఆటగాళ్లు అదరగొట్టారు. క్రమం తప్పకుండా పాయింట్లు చేయడంలో సఫలమయ్యారు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి చెన్నై 64-54తో ఆధిక్యంలో నిలిచింది.

ఇక ద్వితీయార్ధంలోనూ చెన్నై జోరును హైదరాబాద్ ఆటగాళ్లు అడ్డుకోలేకపోయారు. స్లామ్ జట్టు తరఫున జైరామ్ (31) అద్భుతంగా రాణించాడు. మిగతా వారిలో గోపాల్ 21, రామ్ 14 పాయింట్లు చేశారు. హైదరాబాద్ జట్టులో థామస్ (25), మహేశ్ (25) పోరాడారు. మహిపాల్ 17 పాయింట్లు సాధించాడు.

మరిన్ని వార్తలు